Hyderabad | రాజకీయాల్లో ఉన్నంత స్థానాలకు ఎదగాలి…

Hyderabad | రాజకీయాల్లో ఉన్నంత స్థానాలకు ఎదగాలి…

  • ఎమ్మెల్యే వల్లాల నవీన్

Hyderabad | చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని యాదవులు అందరూ ఐక్యంగా, సమిష్టిగా రాజకీయాల్లో ఉన్నంత స్థానాలకు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ అన్నారు. ఈ రోజు యాదవ విజన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని నాచారంలో చిట్యాల మండలం పలు గ్రామాలలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం యాదవ్, సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి సుంకేనపల్లి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్, చిన్న కాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పిట్టంపల్లి గ్రామ సర్పంచ్ అందే అండాలు రాములు యాదవ్, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల యాదమ్మ యాదవ్ లను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శాలువా, పూల బోకే మెమెంటోలతో ఆయన వారిని ఘనంగా సన్మానించారు.

Hyderabad |

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులను ఆయన అభినందించారు గ్రామాలలో ప్రజలకు మంచి సుపరిపాలన అందించి సర్పంచుల పదవులకు వన్నె తేవాలని ఆయన కోరారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, పృథ్విరాజ్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply