Andhra Prabha | క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీ శంకర గురూజీ..
Andhra Prabha | క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీ శంకర గురూజీ..
- అందరి అభిమాన పత్రిక ఆంధ్రప్రభ..
- స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను చైతన్య వంతం చేసిన పత్రిక..
- నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక ఆంధ్రప్రభ..
- ఆంధ్రప్రభ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : అందరి అభిమాన పత్రిక ఆంధ్రప్రభ అని.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ తెలిపారు. అమ్మానాన్నల అనాధల పుణ్యక్షేత్రం, శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రంలో భోగి పర్వదినం సందర్భంగా బుధవారం సాయంత్రం భక్తుల సమక్షంలో ఆంధ్రప్రభ చౌటుప్పల్ డివిజన్ ప్రతినిధి దోనూరు రాంరెడ్డితో కలిసి శ్రీ శంకర గురూజీ చేతుల మీదుగా ఆంధ్రప్రభ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ శంకర గురూజీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేసిన పత్రిక, నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక ఆంధ్రప్రభ అన్నారు. గత 88 సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో రోజు రోజుకు ఆంధ్రప్రభ దిన పత్రిక పాఠకులకు చేరువవుతుందని, ప్రజలను చైతన్య వంతులుగా చేయడంలో ఆంధ్రప్రభకు ప్రత్యేక స్థానముందన్నారు. వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచడం అభినందనీయమన్నారు.
పాఠకుల ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రభ దినపత్రిక, వెబ్, స్మాట్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజల ముందుకు రావడం హర్షనీయమని, మీకు మీ సంస్థకు శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని శ్రీ శంకర గురూజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు శ్రావణి శంకర్, విజయకుమార్, కోటి, వెంకట్, రవి తదితరులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
