Jubilee Hills | అభివృద్ధికి పట్టం కట్టారు..

Jubilee Hills | అభివృద్ధికి పట్టం కట్టారు..

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


Jubilee Hills | జూబ్లీహిల్స్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. శుక్రవారం జరిగిన లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ప్రజలు (Jubilee Hills People) ప్రజాపాలనలో జరుగుతున్న స్పష్టమైన మార్పునకు, వేగవంతమైన అభివృద్ధికి తమ ఘన మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పురోగతి సాధ్యమని మరోసారి ప్రజలు ధృవీకరించారిని, బడుగు బలహీన వర్గాల బిడ్డగా, విద్యావంతుడిగా, స్థానిక ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిని నమ్ముకొని గెలిపించుకుందన్నారు. ఇది ప్రజల ఆశలు, నమ్మకాలు, అభిలాషలకు వచ్చిన చారిత్రక విజయమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ (Naveen Yadav) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply