Warangal | న్యాయం గెలిచింది..

Warangal | న్యాయం గెలిచింది..

Warangal | కరిమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని 34వ డివిజన్ శివనగర్ కార్పొరేటర్ దిద్ది కుమార్ స్వామి(Diddi Kumar Swamy) పై బీజేపీ అభ్యర్థి వేసిన కేసును వరంగల్ న్యాయస్థానం కొట్టివేసి కార్పొరేటర్ గా దిడ్డి కుమారస్వామి ఎన్నిక సక్రమమైనదే అని తీర్పును వెలువరించింది. 2021ఎన్నికల్లో సక్రమంగానే గెలిచాడని వరంగల్ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి తెలిపారు.

వరంగల్ తూర్పు34 డివిజన్ శివనగర్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి పై గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం బీజేపీ వేసినటువంటి తప్పుడు కేసు న్యాయస్థానం కొట్టివేత బీజేపీకి చెంపపెట్టు అని కార్పొరేటర్ దిడ్డి కుమార స్వామి అన్నారు.

ఈ రోజు 34 డివిజన్ శివనగర్ కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో దిడ్డి కుమారస్వామి మాట్లాడుతూ.. 2021 ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించినటువంటి నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఎన్నికల్లో(corporation elections) 34వ డివిజన్ లో పోటీ చేసిన అభ్యర్థులలో ఒకరైనటువంటి బీజేపీ పార్టీకి చెందిన కంటెస్టెంట్ అభ్యర్థి బైరి శ్యాంసుందర్ ఓడిపోయి గెలిచిన కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఎన్నిక చెల్లదు అని అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారని న్యాయస్థానంలో తప్పుడు కేసు వేశారు.

ఈ విషయంపై అప్పటి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు(Ramachandra Rao) కూడా బీజేపీ అభ్యర్థి గెలిచాడని సమర్థించడం జరిగింది. కానీ న్యాయస్థానంలో కేసు విచారణ జరిపి బీజేపీ అభ్యర్థి వేసినటువంటి కేసు చెల్లదు అని కోర్టు కొట్టివేసి కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించడం జరిగిందని కార్పొరేటర్ దిద్ది కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా, నాయకులు కార్యకర్తలు, డివిజన్ ప్రజలు కార్పొరేటర్ కార్యాలయంకు చేరుకొని దిద్ది కుమారస్వామికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపి మిఠాయి పంపిణీ చేశారు.

Leave a Reply