ఏపీకి రండి
- వికసిత్ భారత్ ఇక్కడ సాధ్యం
- పారిశ్రామికవేత్తలకు కేంద్ర సహాయ మంత్రి ఆహ్వానం
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi) వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు AP CM Chandra Babu) అవలంబిస్తున్న చురుకైన విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ Central Minister Srinivas Varma) అన్నారు.
విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు పీయుష్ గో, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులతో కలసి కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ప్రారంభోత్సవ సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నూతన ఆవిష్కరణలు, సుస్థిరత సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు నడిపించబడే ‘వికసిత భారత్’ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను గుర్తు చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందన్నారు.
గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, అది రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ యొక్క బలమైన దార్శనికత, సీఎం చంద్రబాబు చురుకైన నాయకత్వ సహకారం ఆంధ్రప్రదేశ్‌ను అపూర్వమైన ప్రయోజనకరమైన స్థితిలో ఉంచుతున్నాయన్నారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాపార- స్నేహపూర్వక( Friendly Bussiness ) వాతావరణాన్ని సృష్టించడంలో సుస్థిర అభివృద్ధిని (Stable Development) ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు (Progressive Industry Polacy), మౌలిక సదుపాయాల అభివృద్ధి ( Infrastructure development), నైపుణ్యాల పెంపుదల వంటి అంశాలు వ్యాపారులకు, పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌ను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయన్నారు.
భారతదేశ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక పాత్రధారిగా భారత ప్రభుత్వం గుర్తిస్తోంది అని శ్రీనివాస వర్మ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, అభివృద్ధిని పెంచడానికి కేంద్రం రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి సహకారం
నక్కపల్లిలో ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న 17.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను Integrated Steel plant) సులభతరం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రయత్నాలను శ్రీనివాస వర్మ ప్రశంసించారు. వారి ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తూ, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఛత్తీస్‌గఢ్ నుండి నక్కపల్లిలోని స్టీల్ ప్లాంట్‌కు 267 కి.మీ. ఐరన్ -ఓర్ స్లర్రీ పైప్‌లైన్‌ను (Iron Ore Slurry Pipe Line) ఆమోదించిందని అన్నారు. దీనివల్ల తక్కువ ఉద్గారాలు, తక్కువ ఖర్చుతో కూడిన లాజిస్టిక్స్‌ను (Less logistics)అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర పారిశ్రామిక వృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆహ్వానించారు.
