Kadem | కారులో తరలిస్తుండగా రోడ్డుప్రమాదం…

Kadem | కారులో తరలిస్తుండగా రోడ్డుప్రమాదం…
Kadem | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కడెం మండలంలోని మాసాయిపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ దుర్గం లహరిక పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
మాసాయిపేట గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక గుర్తు తెలియని పురుగుమందు తాగినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆగి ఉన్న నాగళ్లకు కారు ఢీకొని మరో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం లహరికను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
