ఉగాది శుభాకాంక్షలతో గ్రామాభివృద్ధికి పిలుపు
ఉగాది శుభాకాంక్షలతో గ్రామాభివృద్ధికి పిలుపు
- చింతనూరి సూర్యనారాయణ గౌడ్
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఉగాది పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారం, ఐకమత్యంతో ముందుకు సాగితే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, లక్ష్యాలు నింపాలని కోరుతూ, గ్రామ ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
