ఉధృతంగా సువర్ణముఖి..

ఎర్పేడు, (ఆంధ్రప్రభ): దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని జల వనరులు పొంగిపొర్లుతున్నాయి. సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడిమల్లం వద్ద శీతకాలవ పొంగి ప్రవహించడం వల్ల ఆలయానికి చేరే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మోదుగులపాలెం మీదుగా పాపానాయుడుపేట, ముసిలిపేడు వైపు వెళ్లే వారికి సువర్ణముఖి నది ప్రవాహం పెద్ద అడ్డంకిగా మారింది. మండలంలోని చెరువులు, వాగులు, వంకలు, సదాశివకోన రిజర్వాయర్ అన్నీ ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వర్షాల కారణంగా రైతులు వరి నాట్లు సహా వ్యవసాయ పనులను వాయిదా వేసుకున్నారు. తహసిల్దార్ భార్గవి, ఎంపీడీవో డాక్టర్ సౌభాగ్యం ఆధ్వర్యంలో అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పేదలను గుర్తించి, వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

Leave a Reply