Temple | జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి

Temple | జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


Temple | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లనపేటలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26వతేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు (A large number of devotees) వచ్చే అవకాశం ఉందన్నారు.
ఎలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు (Traffic) మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట డీఎస్పి రఘు చందర్, SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సి.ఐ రవి, ఎస్.ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఉన్నారు.

Leave a Reply