Kalvakuntla Kavitha | బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది!

Kalvakuntla Kavitha | బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది!
నన్ను విమర్శించేవారిని ఎవరూ రక్షించలేరు
జాగృతి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha | మధిర, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్, బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమం ఈ రోజు ఖమ్మం జిల్లా మధిర నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఎర్రుపాలెం మండలం జమలాపురం (Jamalapuram) లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కవిత వెన్నుపోటురాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను దీర్ఘకాలంగా ఎవరూ రక్షించలేరని అన్నారు. ప్రజా జీవితంలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా దానికి సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. కాంగ్రెస్ (Congress) ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై నిరంతరం జాగృతి సంస్థ పోరాటం చేస్తుందన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జాగృతి సంస్థను బలోపేతం చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అనంతరం మధిర మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న లెదర్ పార్కు స్థలాన్ని ఆమె పరిశీలించారు.
