Margashira | అంబా అగస్తేశ్వర ఆలయంలో గురుచరిత్ర మహోత్సవం

Margashira | చెన్నూరు, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణంలోని అంబా అగస్తేశ్వర ఆలయం (Amba Agasteshwara Temple) లో ఘనంగా గురుచరిత్ర పారాయణ మహోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలోని అష్టమి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు వారం రోజులు శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర (History of Sri Dattatreya Swamy)ను పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు తరలివచ్చి గురు చరిత్ర పారాయణాన్ని శ్రద్ధగా భక్తిశ్రద్ధలతో వింటే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం.
మొదటిరోజు భక్తులు మేడిచెట్టు వద్ద కోరిన కోరికలు తీరాలని కొబ్బరికాయను (Coconut) పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మేడిచెట్టు కింద అర్చకులు గురు చరిత్ర పారాయణ(Guru’s history recitation) చేస్తుంటే భక్తులు వింటూ తరించి పోతుంటారు. సుమారు 100ఏళ్ల నుండి గురు చరిత్రను పారాయణం చేస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. శివాలయంలోని అర్చకులు వేమారపు మహేశ్వర్ శర్మ(Vemarapu Maheshwar Sharma) ఆధ్వర్యంలో గురు చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
