రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- కేంద్రాల్లో గన్ని సంచులు కరువు
- రైతులకు సౌకర్యాలు లేవు
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : రైతుల ధాన్యం,మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మక్కల కొనుగోలు కేంద్రాలను ఆమె స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.మక్కల కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.కొంత మంది రైతులు రైతు రుణమాఫీ సమస్యల గురించి ఏకరువు పెట్టారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. మక్కల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యంపై ఐకెపి అధికారులను ప్రశ్నించారు.గన్ని సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు,ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆలస్యం చేయకుండా ప్రభుత్వం త్వరగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కొమ్ములవంచ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు దొనికెన జంపయ్య కూతురు వివాహం నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వేదికలో జరుగుతుండగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్ బండ బిక్షం రెడ్డి,కౌసల్యదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి,కొమ్ములవంచ మాజీ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొనికేన రామన్న గౌడ్ తదితరులు ఉన్నారు.
