సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజి గౌడ్

సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజి గౌడ్..

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా గరిడపల్లి మండలం, రాయినిగూడెం సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ సోమవారం నియమితులయ్యారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాయితి ఆశాదీప్ రెడ్డి నియామక పత్రం అందజేశారు.

​అంకితభావం ​మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా రామాంజి గౌడ్ గుర్తింపు పొందారు. ​గరిడపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. ​జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా.. వివిధ హోదాల్లో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా పేరున్న రామాంజి గౌడ్‌కు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ​​తన నియామకంపై రామాంజి గౌడ్ స్పందిస్తూ.. తనపై నమ్మకముంచి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

​కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డికి, ​తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకి, ​నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, వేనారెడ్డికి, ​జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, హుజూర్ నగర్ నియోజకవర్గ, గరిడే పల్లి మండల నాయకులకు, సర్పంచులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ​జిల్లాలోని సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.