వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చు

వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చు

  • ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు, ఆంధ్రప్రభ : రైతులు సంఘటితంగా ముందుకు సాగితే వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో రైజింగ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు రైతులకు అవసరమైన సేవలు,మార్కెటింగ్ సదుపాయాలు అందించడంలో ఇటువంటి సంస్థలు కీలకమని పేర్కొన్నారు.
రైతులు ఐక్యంగా పనిచేస్తే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు.విత్తనాలు, ఎరువులు,సాగు సలహాలు,మార్కెట్ అవకాశాలు కల్పించడంలో ప్రొడ్యూసర్ కంపెనీలు ఉపయోగపడతాయని చెప్పారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్, వైస్ చైర్మన్ మల్గ యాదయ్య,చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్, అంబర్‌పేట్ శ్రీనివాస్ యాదవ్,అచ్చన శ్రీనివాస్,బరిగల దుర్గాప్రసాద్,తలారి రాంబాబు,నిరంజన్, మేకల రామస్వామి యాదవ్,చిలుకల శ్రీనివాస్ యాదవ్, బండమీది యాదయ్య, బొమ్మగోని లింగస్వామి గౌడ్,నాగిళ్ల శంకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply