మహిళల అభ్యున్నతికే ‘ఇందిరమ్మ మహిళా శక్తి’
చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది.
మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్లతో కలిసి చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ… మహిళా సంఘాల బలోపేతానికి, వారి అభ్యున్నతికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 మహిళా సంఘాలకు చెందిన సుమారు 192 మంది సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. మిగతా వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు ఆయా సంఘాల మహిళలకు చీరలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో షాదీఖానా చైర్మన్ కరీం, స్థానిక కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్ను, బత్తుల వాణి విప్లవ్, బద్రి గాలయ్య, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, పస్తం గంగారాములు, సందగళ్ళ విజయ సతీష్ గౌడ్ తదితరులతో పాటు, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
