మిత్రుడికి పూర్వ విద్యార్థుల అండ

మిత్రుడికి పూర్వ విద్యార్థుల అండ
గట్టుప్పల, ఆంధ్రప్రభ: ఆపదలో ఉన్న మిత్రుడిని ఆదుకోవడంలో తాము ఎప్పుడూ ముందే ఉంటామని గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు. మండల కేంద్రానికి చెందిన గుర్రం రవి గత కొంతకాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్న రవి పరిస్థితిని తెలుసుకున్న ఆయన తోటి మిత్రులు (గట్టుప్పల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1991-92 విద్యా సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థులు) వెంటనే స్పందించారు.
సోమవారం వారందరూ కలిసి తమ మిత్రుడు రవికి రూ. 51,000 నగదును ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. చదువుకున్న రోజుల్లో ఉన్న స్నేహబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మిత్రుడికి ఈ కష్టకాలంలో అండగా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చెరుపల్లి భాస్కర్, గజవెల్లి లక్ష్మయ్య, మహేశ్వరం బిక్షమాచారి, జెల్ల రామదాసు, శేఖర్ రెడ్డి, ఇంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
