ఎస్ఐఆర్ ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలి

అడిషనల్ కలెక్టర్ విక్టర్

జుక్కల్/కామారెడ్డి/ఆంధ్రప్రభ: ఎస్ఐఆర్ (స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రక్రియ వేగవంతంగా గడువులోగా పూర్తి చేయాలని అర్హులైన ప్రతి ఓటరూ పేరు నమోదయ్యలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) విక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయన జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ బస్వాపూర్, పెద్దఏడ్గి గ్రామాలలో సార్ ప్రక్రియను పరిశీలించారు.

బూత్ లెవెల్ అధికారులు, జిపిఓలు సంబంధిత అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని అధికారులకు అందించి, తమ విలువైన ఓటు హక్కును స్థిరాపరచుకోవాలన్నారు. ప్రజలు తమ ఫారాలను పూర్తి పూర్తిచేసి అందించాలని,ప్రజలు అందించిన ఫారాలను బీఎల్ఓలు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలన్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ బి. శ్రీనివాస్ ఉప తహసీ ల్దార్ హేమలత, సూపర్వైజర్ సాయిప్రసాద్, జిపిఓలు బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ బి. శ్రీనివాస్ ఉప తహసీల్దార్ హేమలత జుక్కల్ మండల కేంద్రంతోపాటు, పెద్దగుల్ల గ్రామాలలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.