మాన‌వ‌త్వం చాటుకున్ననిర్మ‌లజ‌గ్గారెడ్డి

మాన‌వ‌త్వం చాటుకున్ననిర్మ‌లజ‌గ్గారెడ్డి

  • ప్ర‌మాదం జ‌రగ్గానే స్పందించిన నిర్మ‌ల‌
  • అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. క్ష‌త‌గాత్రుడిని ఆసుపత్రికి తరలింపు

సంగారెడ్డి , ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి ఈ ఘటనను గమనించిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వెంట‌నే త‌న వాహ‌నాన్నిఆపి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్ష‌త‌గాత్రుడిని ప్రాథమిక చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించిన నిర్మలజగ్గారెడ్డి మాన‌వ‌త్వం చాటుకున్నార‌ని స్థానికులు ప్రశంసించారు. ప్రమాదాల సమయంలో తక్షణ సహాయం అందించడం ప్రాణాలను కాపాడగలదని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. అయితే టీఎస్ 07 యూఎన్ 3331 గ‌ల రెడ్ మిక్స్ వాహ‌నం వేగంగా వ‌చ్చి ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాల‌య్యాయి. ప‌ట్ట‌ణ పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply