ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు
చిట్యాల, ఆంధ్రప్రభ : ఈరోజు ఆర్యవైశ్యుల ఇలవేల్పు కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా,స్థానిక శివాలయంలో ఆర్యవైశ్య మహాసభ మహిళ అధ్యక్షురాలు బెలిదె నర్మద ఆధ్వర్యంలో మహిళలందరూ పాల్గొని ఘనంగా పూజలు, అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. అలాగే పాల్గొన్న మహిళలకు లక్కీ డ్రా ద్వారా ఐదుగురికి చీరలు బహుమతిగా సుచరిత షాపింగ్ ద్వారా బహుమతిగా ఇచ్చారు. ఈరోజు ప్రోగ్రామ్ మొత్తం ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షులు వాసా విద్యాసాగర్ గారి సహకారం తో నిర్వహించారు.
పూజ తదనంతరం ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ ఆదిపరాశక్తి, ఆర్య మహాదేవి అవతారమని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి స్వయంగా యే చెప్పిందన్నారు. ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు కలియుగంలో తాను జన్మించానన్నారు.
సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్లుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకానికి చేరుకుంటానని చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో తేరటుపల్లి హనుమంతు, వాసా విద్యాసాగర్, బెలిదె సత్యనారాయణ, గజ్జల భాస్కర్, రంగా వెంకటేశ్వర్లు, వాసా రామ్మోహన్, బుద్ధ కృష్ణమూర్తి, రేగొండ వేణుమాధవ్, జగిని వెంకన్న, బోనాల లక్ష్మీనారాయణ, శీల సత్యనారాయణ, బెలిదె నర్మద, బుద్ధ విమల, ఇమ్మడి కళమ్మ, పందిరి అరుణ, వాసా రాదా, చందా నాగలక్ష్మి, బోనాల పద్మ , పందిరి అనురాధ, పందిరి అర్చన తో పాటు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
