ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఒకరి మృతి

ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఒకరి మృతి
మొగుళ్ళపల్లి , ఆంధ్రప్రభ: ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఒకరి మృతిచెందగా, ముగ్గురికి గాయాలైన సంఘటన గురువారం మండలంలోని పర్లపల్లి, పెద్దకొమటిపల్లి గ్రామాల మధ్య జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె, సాత్విక, మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాలలో గల కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది. ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించడంతో గురువారం విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లేందుకు సొంత ఆటోపై దగ్గరి బంధువైన ఎదురుకొల్ల స్వప్నతో కస్తూర్బా గురుకుల పాఠశాలకు చేరుకున్నారు.
ఇంటికి తిరుగు ప్రయాణంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో కోల సాన్విక (24) అక్కడికక్కడే మృతి చెందింది. కోల అనిల్ , కోల సాత్విక, ముదురుకోళ్ల స్వప్నలు స్వల్ప గాయాల పాలయ్యారు. అక్కడున్న స్థానికులు వెంటనే 108కి కాల్ చేయగాచికిత్స నిమిత్తం వారిని జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మెరుగైన వైద్యం కోసం హుజురాబాద్ లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఫోన్ కాల్ చేయగానే వెంటనే స్పందించిన 108 సిబ్బంది శీలపాక రాజు, సత్యంలను ప్రజల అభినందించారు .
