హైకోర్టు తీర్పు పట్ల బీఆర్ఎస్ నాయకుల హర్షం

హైకోర్టు తీర్పు పట్ల బీఆర్ఎస్ నాయకుల హర్షం

చెన్నూర్, ఆంధ్రప్రభ: పీసీ ఘోష్ కమిటీ నివేదికను హైకోర్టు తప్పు పట్టడాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకుల హర్షం వ్యక్తం చేశారు. ఈ సంందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో నాయకులు మాట్లాడుతూ… కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ నివేదికను హైకోర్టు తప్పుబట్టడం హర్షణీయమనీ కాళేశ్వరం ప్రాజెక్టులు కడితే సంతోషించాల్సింది పోయి తప్పు పట్టడం సిగ్గుచేటు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడాది పొడవుగా గోదావరిలో నీళ్లు నిల్వ ఉండేవని, తద్వారా కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని వివరించారు. కానీ హైకోర్టు తీర్పు వల్ల ప్రజలకు నిజాలు తెలిశాయని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైన వెంటనే మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు పేల్చినారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి వైస్ చెర్మన్ మూల రాజిరెడ్డి, 11 వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్ రెవెల్లి మహేష్, దోమకొండ అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్ రెడ్డి, మాజీ చెన్నూరు మండల పరిషత్ అధ్యక్షుడు మంత్రి బాపు, చెన్నూరు మాజీ జడ్పీటీసీ మోతే తిరుపతి, కిష్టంపేట మాజీ సర్పంచ్ బుర్ర రాకేష్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు 50 మంది పాల్గొన్నారు.

Leave a Reply