పోషక పదార్థాలని సద్వినియోగం చేసుకోవాలి..

పోషక పదార్థాలని సద్వినియోగం చేసుకోవాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాల ద్వారా బాలింతలకు గర్భవతులకు కిశోర బాలికలకు అందిస్తున్నటువంటి మంచి పోషక పదార్థాలని సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్, ఆరోగ్యలక్ష్మి కమిటీ చైర్మన్ పందిరి గీత పేర్కొన్నారు. శనివారం నాడు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పరిధిలోగల అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరోగ్యలక్ష్మి కమిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మున్సిపాలిటీ చైర్మన్,ఆరోగ్య లక్ష్మి కమిటీ చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ ఆరోగ్యలక్ష్మి ప్రతి గర్భిణీ స్త్రీ బాలింతలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మికి ప్రతి గర్భవతి భోజనం చేసి పోవాల్సిందిగా బాలామృతం బాలామృతం ప్లస్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాల్సిందిగా మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకు ఆరోగ్య లక్ష్మి భోజనము పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడి కేంద్రంలో అందిస్తున్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు వడదెబ్బ తగలకుండా పిల్లలందరికీ కొబ్బరి నీళ్లు తాగాలని తెల్లటి వస్త్రాలు ధరించాలని వడదెబ్బ గురికాకుండా మీరు అందరూ ఎండలో బయటికి వెళ్లరాదని మాట్లాడారు ఈ కమిటీలో భాగంగా రిటైర్మెంట్ టీచర్ కృష్ణమూర్తి సైన్స్ టీచర్ పద్మ టీచర్ గర్భవతి అఫ్రీన సరళ ప్రసన్న ఏఎన్ఎం పుష్ప ఆశా కార్యకర్త సైదమ్మ అంగన్వాడి టీచర్ అపర్ణ దాడి అరుణ కుసుమ గర్భవతులు బాలింతలు, కిషోర్ బాలికలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Leave a Reply