సింహం బయటకు వస్తుంటే.. గుంట నక్కలు పరిగెడుతున్నాయి..

సింహం బయటకు వస్తుంటే.. గుంట నక్కలు పరిగెడుతున్నాయి..

జగిత్యాల నుండి జైత్రయాత్ర
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జగిత్యాల, ఆంధ్రప్రభ : సింహం బయటకు వస్తుంటే గుంట నక్కలు భయంతో పరిగెడుతున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి మాట్లాడారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20న జరిగే కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏడాది తర్వాత తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన్ రెడ్డి చేరిక బహిరంగ సభకు హాజరవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయంతో మేడిగడ్డకు పోతున్నారాన్నారు.

మూడేళ్లుగా మేడిగడ్డ పరిశీలించే సమయం ముఖ్యమంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్ని రకాల కుట్రలు పండిన జగిత్యాల సభ విజయవంతం అవుతుందని జగిత్యాల నుండి జైత్ర యాత్ర ప్రారంభం కానుందన్నారూ. ఇప్పటివరకు తాను ముఖ్యమంత్రికి హైట్ మాత్రమే తక్కువ అనుకున్నానని బుర్ర కూడా తక్కువ ఉందని ఇప్పుడే తెలిసిందన్నారు. సభను అడ్డుకునేందుకు కోరుట్ల నుండి వచ్చే దారిలో తవ్వకాలు చేపట్టారని జన ప్రభంజనాన్ని ఈ ప్రభుత్వం ఆపలేదన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ 6 గ్యారంటీల మోసాన్ని ప్రజలకు తెలియజేస్తారని ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు.

తేజస్వి క్షమాపణలు చెప్పాల్సిందే… మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో తేజస్వి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే అటుకోవాల్సిన బీజేపీ మంత్రులు, బిజెపి ఎంపీ లు, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉండటం తెలంగాణ ప్రజలు గమనించారన్నారు. భారత రాష్ట్రపతి ఎంపీలు లోక్సభలో లేని లోటు కనిపించిందన్నారు.

Leave a Reply