Chityala | వృద్ధులకు పండ్లు పంపిణీ
Chityala | వృద్ధులకు పండ్లు పంపిణీ
చిట్యాల (Chityala), ఆంధ్రప్రభ: ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే నార్కట్‌పల్లి వృద్ధాశ్రమంలో బుద్ధుడు అభిమానులు వృద్ధులకు స్నాక్స్ అందజేశారు.
ఊరుమడ్ల గ్రామంలో జన్మదినం సందర్భంగా గ్రామపంచాయతీకి ఆయన ఫ్యాన్‌ను బహూకరించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమంలో పల్లపు బుద్ధుడు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం సర్పంచ్ సాగర్ల భాను శ్రీ పల్లపు బుద్ధుడును శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కార్యదర్శి ఏలంధర్ రెడ్డి, పాకాల దినేష్, స్వాతి శ్రీను, పి రామకృష్ణ, రాకేష్, సాయి, శివ, వెంకటేష్, బి. లక్ష్మయ్య, స్వామి, జి. రాము, బి. శివ, ఎం. నరేష్ తదితరులు పాల్గొన్నారు.
