TG | పాఠకుల హృదయాలలో నిలిచిన పత్రిక ఆంధ్రప్రభ…

TG | పాఠకుల హృదయాలలో నిలిచిన పత్రిక ఆంధ్రప్రభ…

  • 2026 క్యాలెండర్ లను ఆవిష్కరణ చేసిన సీఐ అబ్బయ్య – ఎస్సై ఎస్ కే. హమీద్ …

TG | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : గత 88 ఏళ్ళుగా పాఠకుల హృదయాలలో ఆంధ్రప్రభ దినపత్రిక ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఆంధ్రప్రభ దినపత్రిక పనిచేస్తుందని నర్మేట సీఐ అబ్బయ్య , ఎస్సై ఎస్కే హమీద్ లు అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రభ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్లను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 88 సంవత్సరాల నుండి 89వ‌ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆంధ్రప్రభ దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తుందని గుర్తు చేశారు.

ఆంధ్రప్రభలో వస్తున్న పలు శీర్షికలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రభ దినపత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రభ యజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతిరోజు ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం తనకు అలవాటుగా మారిందన్నారు. విభిన్న కథనాలతో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజల్లోకి వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు . పోలీస్ శాఖ తరపున ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యం సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యాదగిరి, రాము, నిఖిల, పలువురు పాల్గొన్నారు.

Leave a Reply