కేటీకే-5 గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు
- ఏరియా ఆసుపత్రికి తరలించిన అధికారులు
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి సింగరేణి కేటీకే-5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గనిలో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పృద్వి మొదటి షిఫ్ట్ విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు వాటర్ పైపుపై పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి కార్మికులు వెంటనే అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించి అంబులెన్స్‌లో భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.ఘటనపై సమాచారం అందుకున్న గని అధికారులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదం మరింత తీవ్రంగా మారకుండా తప్పిపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
