ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు..

ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు..

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం లోని చౌట్ పల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పశువులకు గాలి కుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మహబూబ్ అలీ ప్రారంభించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మహబూబ్ మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పకుండా ఆరు నెలలకు ఒక్కసారి టీకా వేయించుకోవాలని సూచించారు. ఆనంతరం పశు వైద్యధికారి డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ జీవాలు గాలికుంటూ వ్యాధి భారిన పడటంతో నోటిలో పుల్లతో చొంగ కారడం,కాలి డెక్క లలో పగుళ్ళు ఏర్పడి నడవలేకపోవడం,పాల ఉత్పత్తి తగ్గి పోవడము,పాడి పశువులు అబార్షన్ అవ్వడం వంటి లక్షణాలు ఏర్పడతాయి అన్నారు.రైతులు ముందు జాగ్రత్త కోసం తప్పకుండ గాలికుంటూ నివారణ టీకాలు చేయించుకోవాలని కోరారు.26 గోజాతి,140 గేదె జాతి పశువులకు ఉచితంగా గాలి కుంటూ నివారణ టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సట్ట విశాల్,రైతులు, పశువైద్య సిబ్బంది సత్యం,స్పరన్ గోపాలమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply