NZB | బీసీ కులగణన.. కాంగ్రెస్ కుట్ర.. ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) : బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నా రు. బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం ఖాయమని నొక్కి చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేసాము, మా అంత గొప్ప పార్టీ, గొప్ప నాయకులు దేశంలో ఎవరూ లేరన్నట్టు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని బీసీ వర్గం ప్రజలను మోసం చేసే కుట్ర అసెంబ్లీలో జరిగిందన్నారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా అని ఆరోపించారు. గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్లకు పైగా అంటే 51 శాతం ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు అంటే 46.25 శాతం నిర్ణయించిందని, మరి దాదాపు 21లక్షల బీసీలు ఏమైనారని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేదానికి తాము వ్యతిరేకం కాదని, కానీ బీసీ కులగణన పేరుతో మైనారిటీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్ర చేసినట్లు తమకు అనుమానం వస్తుందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క దానికైనా కనీసం శంకుస్థాపన చేసారా అని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చకుంటే రేవంత్ సర్కార్ ను బీసీ బిడ్డలు కూల్చడం ఖాయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్స్ రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా.. ఎమ్మెల్యే ధన్ పాల్
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. అంతేకాకుండా తన ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తానని బాధితులకు భరోసా కల్పించారు. నగరంలోని కోటగల్లీ మార్కెండేయ ఆలయ సమీపంలో మధి ర ప్రసాద్, సుమలత నివసిస్తున్న ఇండ్లలో ఇంట్లో వెలిగించిన ద్వీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. తన ట్రస్ట్ ద్వారా స్వంతంగా బాధిత కుటుంబానికి రూ.25వేలు ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

వెంటనే ఆర్డీవోతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు పునరావాస కల్పన, ప్రభుత్వం నుండి రావాలిసిన సహాయ సహకారాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కలెక్టర్ తో మాట్లాడి ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం నుండి వచ్చే ఇందిరమ్మ ఇళ్ళు రూ.5లక్షల ఆర్ధిక సహాయం కూడా అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, బీజే వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, జగన్, ఆనంద్, మఠం పవన్, మున్నా, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *