చేంగల్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

భీమ్‌గల్‌ రూరల్ , ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు మరువలేనివని సర్పంచ్ మమత అన్నారు. భీమ్‌గల్‌ మండలంలోని చేంగల్ గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ దుమల మమత (రాజు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మాజీ ప్రధాని దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply