TG | ఘనంగా ముగ్గుల పోటీలు

TG | ఘనంగా ముగ్గుల పోటీలు

TG | కుంటాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఘనంగా ఈ రోజు స్థానిక శ్రీకృష్ణ ప్రాచీన ఆలయంలో మహిళలు మరియు విద్యార్థులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్ చేతుల మీదగా బహుమతులను ప్రధానం చేశారు. ప్రతి సంక్రాంతి సందర్భంగా శ్రీకృష్ణ ప్రాచీన ఆలయంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు, విద్యార్థులకు పంచాయతీ కార్యదర్శి చాట్ల గాయత్రి సరస్వతి స్వచ్ఛందంగా బహుమతులను అందజేశారు, అనంతరం స్థానిక సర్పంచ్ వారి ఆధ్వర్యంలో గెలుపొందిన వారికి బహుమతులు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ పడకంటి దత్తు, తాటి శివ, ఎల్లమల్ల శంకర్, శీను , మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.