Kuntala | ముగిసిన క్రికెట్ పోటీలు

Kuntala | ముగిసిన క్రికెట్ పోటీలు
Kuntala | కుంటాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రమైన కుంటాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఇవాళ ముగిశాయి. ఈసందర్భంగా గత మూడు రోజుల పాటు సాగిన క్రికెట్ పోటీలు ముగియడంతో స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ… క్రీడల పట్ల యువకులు ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు చాలా విలువైనవని, క్రికెట్ ఆటలతో పాటు బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ పోటీల్లో సైతం రాణించాలని యువతకు సూచించారు.
ప్రతి సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలతో పాటు ఎన్నో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలతో పాటు చదువు పట్ల యువకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోటీ పరీక్షలు నేపథ్యంలో యువత పట్టుదలతో చదువుకుని మంచి ర్యాంకులు సాధించాలని యువతకు సూచించారు. అనంతరం క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన కంపెనీ శేఖర్ జట్టుకు సృజన విద్యా నిలయం ప్రిన్సిపల్ కొత్త కాపు గంగన్న రూ.5వేల నగదును అందజేశారు. అదేవిధంగా సోమశంకర్ బహుమతులను ప్రధానం చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన జట్టును స్థానిక సర్పంచ్ తో పాటు పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరికిపండ్ల వెంకటరమణ, స్థానిక నాయకులు జుట్టు మహేందర్, పడకంటి దత్తు తాటి శివ, సబ్బిడి రాకేష్, నాగులపల్లి మాధవ్ రావు, శీను, రాకేష్, స్థానిక నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
