వడదెబ్బ కారణంగా జబ్బా రామనాధం మృతి..

వడదెబ్బ కారణంగా జబ్బా రామనాధం మృతి..
జూలూరుపాడు ఆంధ్రప్రభ : వడదెబ్బ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జూలూరుపాడు మండలంలోని బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా రామనాధం (55)@ సుధాకర్ మృతి చెందాడు.మంగళవారం బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం మే 23వ తేదీన రామనాధం వడదెబ్బకు గురయ్యాడని చెప్పారు.
సోమవారం కొత్తగూడెంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందారన్నారు.మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వరంగల్ నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం జబ్బా రామనాధం మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు.వడదెబ్బతో రామనాధం మృతి చెందినట్లు భార్య అనసూర్య జూలూరుపాడు పోలీసులకు పిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రామనాధం మృత దేహాన్ని కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
