చిన్నారుల చిరునవ్వుల కోసం సైకిళ్ల పంపిణీ

చిన్నారుల చిరునవ్వుల కోసం సైకిళ్ల పంపిణీ

జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 70 మందికి అందజేత

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా మరో 70 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు.

ప్రత్యేకంగా 8 ఏళ్ల లోపు వయస్సు గల చిన్నారులకు సైకిళ్లు అందజేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు సంగారెడ్డి ప్రాంతంలో సుమారు 400 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్ సమర్పించి పేర్లు నమోదు చేసుకున్న ప్రతి చిన్నారికి విడతల వారీగా సైకిళ్లు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన, ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు టోకెన్లు పంపిణీ చేశారు. వారికి వచ్చే ఆదివారం సైకిళ్లు అందజేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.

సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో చిన్నారులతో జగ్గారెడ్డి ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారితో కరచాలనం చేస్తూ సరదాగా గడిపారు. చిన్నారులు కూడా ఆనందంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు కూన సంతోష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply