బాధిత రైతులను ఆదుకుంటాం

బాధిత రైతులను ఆదుకుంటాం

-భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్‌ఆర్‌

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని రామచంద్రపురం, చల్లగరిగ జూకల్, గ్రామాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో దగ్ధమైన అరటి, ఆయిల్ ఫామ్, అరటి తోటల బాధిత రైతులను ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు, నష్టపరిహారం అందించి ఆదుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. గురువారం మండలంలోని రామచంద్రపురం కు చెందిన రైతు సిరిపురం కుమార స్వామి నాలుగు ఎకరాల అరటి తోట, ఆకుల సమ్మయ్య టేకు తోట, చల్లగ రీగ కు చెందిన చాలా సమ్మిరెడ్డి ఆయిల్ ఫామ్, జూకల్ శివారులో కురిమిళ్ళ సత్తయ్య, కుమార్, ఆయిల్ ఫామ్ తోటలు, విద్యుత్ గాదం తో దగ్ధమైయ్యాయి.

దీంతో శుక్రవారం ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ రామచంద్రపురం లో బాధిత రైతుల అరటి ,టేకు తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో విద్యుత్ శాఖ అధికారులు, రైతులు, విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోరారు. విద్యుత్ గాదంతో నష్టపోయిన రైతుల పంటలను సంబంధిత అధికారులు సర్వే చేసి, ప్రభుత్వానికి నివేదిక అందించి, బాధిత రైతులను ప్రభుత్వం, విద్యుత్ శాఖ , ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వసంతరావు, ఎంపీడీవో జయశ్రీ, కాంగ్రెస్ నాయకులు ముఖిరాల మధువంశీకృష్ణ, గూట్ల తిరుపతి, కామెడీ రత్నాకర్ రరెడ్డి, బండి భగవాన్, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply