వరల్డ్ కప్కు ఎంపికైన బాలికను ఘనంగా సన్మానం..

వరల్డ్ కప్కు ఎంపికైన బాలికను ఘనంగా సన్మానం..

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమి సెంటర్లో సోమవారం రోజున స్టాప్ బే స్ వరల్డ్ కప్ ఎంపికైన బాలికను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మస్తాడే ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ.
భారతరత్న డా. బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ స్ఫూర్తితో, ఇంటర్నేషనల్ లెవెల్లో సాఫ్ట్ బేస్ బాల్ వరల్డ్ కప్‌కు ఎంపిక కొరకు దుర్గం శైనీశ్రీకి ప్రోత్సాహంగా, ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం అలాగే రూ.11,500/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఆమె అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి, మన జిల్లాకు, మన సమాజానికి కీర్తి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ అధ్యక్షులు మసాజ్ ప్రశాంత్, సెంటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్, లుమిని దీక్ష భూమి అధ్యక్షులు తుకారం, సెంటర్ కమిటీ గౌరవ అధ్యక్షులు పెరుగు ఆత్మరామ్ సెంటర్, సెంటర్ కమిటీ ఉపాధ్యక్షులు చల్లూర్కార్ వామన్, డోంగ్రీ ప్రవీణ్, మున్సిపాలిటీ కౌన్సిలర్ జాడీ వినోద్, కోబ్రగడె కిషోర్ llb , సెంటర్ కమిటీ సలహాదారులు దుర్గం శ్యామ్ రావు ప్రచార కార్యదర్శి లోహాజీ, జై భీమ్ సేన కమిటీ సభ్యులు జాడి అశోక్, కోచ్ దుర్గం దేవేందర్, తికనంద్ చంద్రీ పెంటయ్యా, మహిళా మండలి, జై భీమ్ సేన కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.