ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

కడెం (ఆంధ్రప్రభ): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ అన్నారు. కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కమ్ముల లక్ష్మీస్వామి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజు, ఈజీఎస్‌ఎఫ్‌ఏ జెట్టి రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.