కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి

  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి ప్రారంభించారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు ఈ ఏడాది జొన్న పంటను అధికంగా సాగు చేశారని తెలిపారు. ప్రభుత్వం చింతల్ జొన్నలకు క్వింటాల్‌కు రూ.3,699 మద్దతు ధర నిర్ణయించిందని పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ జొన్నలను విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. మండల పరిధిలోని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, దళారులకు అమ్మి నష్టపోవద్దని ఆమె కోరారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు మాణిక్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మస్కు నరసింహారెడ్డి, డీసీఎంఎస్ అధికారులు ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు కిషన్ నాయక్, గౌడిచర్ల నరసింహులు, ప్రభాకర్, అశోక్, బాలరాజు గౌడ్, సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఏవో గణేష్, ఏఈఓ రవి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply