రామకృష్ణాపూర్ సి హెచ్ పి కార్యాలయ ఆవరణలో ధర్నా

పనిముట్లు, రక్షణ పరికరాలు కల్పించాలని డిమాండ్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ సింగరేణి సి, హెచ్, పి,లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఫిట్ సెక్రెటరీ హరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికిఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య ముఖ్య అతిథులుగాహాజరయ్యారు కార్మికులతో కలిసి కార్యాలయం ముందు నినాదాలు చేసి అనంతరం సి హెచ్ పి సీనియర్ ఇంజనీర్ ఎం, చంద్రమౌళికి మెమొరాండంఅందజేశారు.ఈ సందర్భంగా అక్బర్ ఆలీ మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులకు సరైన పనిముట్లు, రక్షణ పరికరాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలు, విడిభాగాలు వెంటనే అందుబాటులో ఉంచాలని, ఐరన్ స్ట్రక్చర్ గ్యాండ్రీకి రస్ట్ పెయింట్ వేయాలని డిమాండ్ చేశారు. టెండర్ టూల్, ప్రమోషన్లు ఇవ్వాలని, జి, ఎల్,బంకర్ వద్ద బౌండరీ స్టాపర్ ఏర్పాటు చేయాలని, ఐ ,ఆర్,బంకర్‌ను రెగ్యులర్‌గా నడపాలని,40, హెచ్, పి, బంకర్ వద్ద ఫీడర్ ఏర్పాటుచేయాలనికోరారు.ఈ కార్యక్రమంలో ఫిట్ కమిటీ సభ్యులు సిరాజుద్దీన్, కృష్ణస్వామి, సీతారామారావు, వేణుగోపాల్, ప్రజాత్ కుమార్, మండల శ్రీనివాస్, బొంద్యాలు జంగం, శ్రీనివాస్, కోటి మల్లమ్మ, రజిత, పాల్గొన్నారు.