గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం..

గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం..

-సేవించినా.. విక్రయించినా కఠిన చర్యలు

– సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఏ ఒక్కరు గంజాయి, మత్తు పదార్థాలను సేవించినా.. విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు హెచ్చరించారు. శుక్రవారం సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాలలో నారొ క్కటిక్ బృందం సుల్తానాబాద్ పోలీసులు సంయుక్తంగా యాంటీ నార్కోటిక్స్ స్వీపర్ డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గంజాయి మత్తు పదార్థాలు సేవించిన విక్రయించిన రవాణా చేపట్టిన తీవ్ర పరిణామాలు ఉంటాయని, వాటిని ఎవరు సేవించవద్దని, వాటికి దూరంగా ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమించి విక్రయించినా, సేవించినా వివిధ పరీక్షల ద్వారా వారిని గుర్తించి కేసులు నమోదు చె స్తామని, ఎట్టి పరిస్థితిలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. రైస్ మిల్లు ఇటు కాబట్టి యజమానులు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలాగే తమ ఇండస్ట్రీలలో పనిచె స్తున్న ప్రతి వ్యక్తి గుర్తింపు కార్డులను విధిగా సేకరించాలని, వారి పూర్తి సమాచారం యాజమాన్యం వద్ద ఉండాలని సూచించారు. ఇండస్ట్రీలలో పనిచేసే మహిళలు చిన్నపిల్లలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

మిల్లులు, ఇటుక బట్టీల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎవరైనా గంజాయి మొక్కలను పెంచితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలంతా శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరారు. తనిఖీలలో ఎస్సై చంద్రకుమార్, మూడవ ఎస్సై అశోక్ రెడ్డి, నార్కోటిక్, డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply