మర్యాద పూర్వకంగా ఎస్ఐని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

మర్యాద పూర్వకంగా ఎస్ఐని కలిసిన బిఆర్ఎస్ నాయకులు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఇటీవల కాలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వెంకన్నను నర్సింహులపేట బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పూల బొకేను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని యువత మద్యం,గంజాయికి బానిస కాకూడదని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్,మాజీ వార్డు మెంబర్ మదార్,కుదుర్ల నాగరాజు తదితరులు ఉన్నారు.
