నర్సింహులపేట బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

పార్టీ జెండాను ఆవిష్కరించి.. స్వీట్లు పంచి సంబరాలు

నర్సింహులపేట,ఏప్రిల్27(ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నాలుగేళ్ల కిందట బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెడుతుందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి యూరియా ఇబ్బందులు కలగకుండా చూశారని నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కెసిఆర్ ప్రభుత్వంలోని తాగు,సాగునీరు ప్రజలకు సమృద్ధిగా లభించాయని ఆయన కొనియాడారు.రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రతి కార్యకర్త పార్టీ కొరకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుగులోతు రవి నాయక్,వంతడపల సర్పంచ్ బాలు నాయక్,పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి,నెలకుర్తి సత్తిరెడ్డి,బండ బిక్షం రెడ్డి,మాజీ సర్పంచులు బోడపట్ల నర్సయ్య,దాసరోజు వెంకటేశ్వర్లు, మందుల యాకయ్య,యూత్ నాయకులు పాతూరి రమేష్ రెడ్డి,బండి రమేష్,కర్ల నాగన్న,గుగులోత్ లక్పతి,మూడవత్ వెంకన్న,రెడ్డి,గుజి వీరస్వామి,డోకెన రామన్న గౌడ్,కాలు నాయక్,మందుల పరుశరాములు,చిమ్ముల వెంకట్ రెడ్డి,మంచాల శ్రీశైలం,యుగంధర్,రవి,రావుల శ్రీను,రెడ్యా,శంకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply