ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి

  • రైస్ మిల్లర్ల తో చిట్యాల ఎస్సై సతీష్

​చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు, దిగుమతులు, రైస్ మిల్లుల యజమానులు వేగవంతం చేయాలని, చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ ఆదేశించారు. బుధవారం మండలంలోని పలు రైస్ మిల్లను ఎస్ఐ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లులకు వస్తున్న ధాన్యం లారీలు, ట్రాక్టర్ల అన్లోడ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.​

అనంతరం రైస్ మిల్లు యజమానులతో ధాన్యం దిగుమతి చేసే కూలీలతో మాట్లాడారు. ధాన్యాన్ని మిల్లుల వద్ద ఎక్కువ సేపు వేచి ఉండకుండా, వెంటనే అన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, రైతులను అనవసరంగా వెయిట్ చేయించవద్దని మిల్లు యజమానులను కోరారు . కూలీలు, మిల్లు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్సై సతీష్ కోరారు.