యువ రైతు ఆకస్మిక మృతి

యువ రైతు ఆకస్మిక మృతి

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న ఓ కౌలు రైతు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన ఘటన చౌటుప్పల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..​ కైతపురం గ్రామానికి చెందిన కందగట్ల నిరంజన్ రెడ్డి (36) మల్కాపురం రెవెన్యూ పరిధిలోని బుర్ర ప్రభాకర్ రెడ్డి కి చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. మంగళవారం నిరంజన్ రెడ్డి ఎప్పటిలాగే పొలం వద్దకు వెళ్లి గడ్డిమోపు కడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

సమీపంలోనే ఉన్న ముద్దం మహిపాల్ అనే వ్యక్తి గమనించి, వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ప్రైవేటు వాహనంలో నిరంజన్ రెడ్డిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అతను అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ​ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు తెలిపారు. యువ రైతు నిరంజన్ రెడ్డి మరణంతో కైతపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply