Yedapally | జానపద కళోత్సవాలను విజయవంతం చేయాలి
Yedapally | జానపద కళోత్సవాలను విజయవంతం చేయాలి
- జూన్ 14 నుంచి 26 వరకు జానకంపేటలో వైభవంగా నిర్వహణ
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జూన్ 14 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న జానపద కళోత్సవాలను విజయవంతం చేయాలని జానపద కళోత్సవాల బోధన్ ఏరియా ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం జానకంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ కళారూపాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కళోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గొబ్బియలు, కోలాటం, శాస్త్రీయ నృత్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం, గురుబోధ, సంగీత విభావరి తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కళాకారులు, కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో దారం పోతన్న, సిర్పలింగం, మద్దెల గంగారాం తదితరులు పాల్గొన్నారు.
