అకాల వర్షం ఈదురు గాలుల బీభత్సం
అకాల వర్షం ఈదురు గాలుల బీభత్సం
కూలిన విద్యుత్ స్తంభాలు
కూలిన భారీ వృక్షాలు నేలరాలిన మామిడికాయలు
ఈదురు గాలులకు కూలిపోయిన కోళ్ల ఫారం
సంస్థాన్ నారాయణపురం , ఆంధ్రప్రభ : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అర్ధరాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది.గుడిమల్కాపురం గ్రామంలో ఏనుగు మల్లా రెడ్డి కోళ్ల ఫారం ఈదురుగాలికి పూర్తిగా నేలమట్టమయింది.రజక కాలనీలో ఐమాక్స్ లైట్ నేలకొరిగింది. భారీగా వీసిన గాలులకు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసం అయి మామిడికాయలు నేలరాలాయి. ఆయా గ్రామాలలో ఇండ్ల రేకులు ధ్వంసం అయ్యాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. గుడిమల్కాపురం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.


