కాయితోజు లక్ష్మి–సోమన్న గృహప్రవేశానికి హాజరైన సమ్మి గౌడ్ చిలువేరు
కాయితోజు లక్ష్మి–సోమన్న గృహప్రవేశానికి హాజరైన సమ్మి గౌడ్ చిలువేరు
పట్టు వస్త్రాలతో సత్కారం… సేవా స్పూర్తిని చాటిన సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత
కేసముద్రం, మే 4(ఆంధ్రప్రభ): మిత్రులు, కుటుంబసభ్యులు కాయితోజు లక్ష్మి–సోమన్న దంపతుల నూతన గృహప్రవేశ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మి గౌడ్ తన సోదరుడు సాయి గౌడ్ తో కలిసి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా సమ్మి గౌడ్ గృహ యజమానుల కుటుంబ సభ్యులను పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించి, వారి ఆనందంలో భాగస్వాము లయ్యారు.. ఆయన అందించిన పట్టు వస్త్రాలు కేవలం బహుమతిగా కాకుండా, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచాయి.అనంతరం గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో సమ్మి గౌడ్ భక్తిశ్రద్ధలతో పాల్గొని, పూజ కార్యక్రమాలను ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. వ్రతాంతరంలో స్వామివారి తీర్థప్రసాదాలను వినమ్రంగా స్వీకరించారు…ఈ సందర్భంగా ఇలాంటి శుభసందర్భాల్లో పరస్పరం ఆనందాన్ని పంచుకోవడం మన సంస్కృతికి అద్దం పడుతుంది. మన మధ్య ప్రేమాభిమానాలు, సేవా భావం పెరిగితే సమాజం మరింత బలపడుతుంది. ఈ నూతన గృహంలో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన గృహానికి ఆశీస్సులు అందజేశారు. వేడుక అంతా ఆధ్యాత్మికత, ఆనందోత్సాహాలతో కళకళలాడింది..
