Telangana | ఆర్టిజన్ల సమ్మె విరమణ..

Telangana | ఆర్టిజన్ల సమ్మె విరమణ..
హైదరాబాద్,ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యుత్ రంగంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర విద్యుత్ శాఖ ఆర్టిజన్లు తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు (శుక్రవారం) ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఆర్టిజన్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
సచివాలయంలో మంత్రి భట్టి విక్రమార్క సమక్షంలోనే సమ్మె విరమణ పత్రాన్ని అందజేసిన ప్రతినిధులు, వెంటనే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకంతోనే ఈ ముందడుగు వేసినట్లు వారు తెలిపారు. ఈ పరిణామంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
