టీఆర్ఎస్ జెండా గద్దె ధ్వంసం..

టీఆర్ఎస్ జెండా గద్దె ధ్వంసం..

తెలంగాణ రక్షణ సేన ఆగ్రహం
జెండా గద్దె కూల్చివేతపై నిరసన
పార్టీ ఆదరణను చూసి ఓర్వలేకే దుశ్చర్య : టీఆర్ఎస్

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జెండా గద్దెను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి నరేష్ నేత అన్నారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి ధ్వంసమైన జెండా గద్దె ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్తున్న తెలంగాణ రక్షణ సేనకు పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. జెండా గద్దె ధ్వంసానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు షేక్ సిద్ధిక్, వినోద్, గోవర్ధన్, విద్యార్థి నాయకులు లడ్డు, విఘ్నేష్, సన్నీ, సిరాజ్, వంశీ, శివ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.