Telangana | నిప్పులగుండంలో పడి…

Telangana | నిప్పులగుండంలో పడి…
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర జరుగుతోంది. ఈ జాతరలో భక్తులకు గాయాలయ్యాయి. అగ్నిగుండం దాటుతుండగా భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులు నిప్పులగుండంలో పడ్డారు. పది మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
