TDP vs YCP | తిరువూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. వైసీపీకి కొలికపూడి సవాల్

తిరువూరు, ఆంధ్రప్రభ – రౌడీయిజంతో… గుండాలను తీసుకువచ్చి.. అరాచకం సృష్టించాలని ప్రయత్నించింది మీరు కాదా అంటూ వైసిపి నాయకులను తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కౌన్సిల్లో సంక్షేపాన్ని సృష్టించిన మీరే స్వేచ్ఛగా కౌన్సిలర్లు ఓటు వేస్తామంటే వారిని బలవంతంగా కిడ్నాప్ చేసి నిర్బంధించింది మీరు కాదా అంటూ నిలదీశారు. మీ నాలుగు సంవత్సరాల పాలనలో తిరువూరులో అభివృద్ధి ఏం జరిగిందో చెప్పే ధైర్యం ఉందా అని ఆయన, ఏడాదికాలంగా జరిగిన అభివృద్ధి మొత్తాన్ని వివరిస్తానని బహిరంగ చర్చకు రావాలని వైసిపి నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ప్రోజోపయోగ సలహాలను తప్పకుండా స్వీకరిస్తామన్న ఆయన దౌర్జన్యాలకు పాల్పడతాం అంటే సహించేది లేదని హెచ్చరించారు.

పట్టణంలోని శాసనసభ్యుడు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు నిర్మాణాత్మక పాత్ర పోషించారని తెలిపారు. మీ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట, వర్గ విభేదాలతో సంక్షోభాన్ని సృష్టించి చైర్మన్ తో రాజీనామా చేయించింది మీరు కాదా అన్నారు. ఏడాదిగా తిరువూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రవాహంలో వస్తున్న నిధులు అమలవుతున్న సంక్షేమాన్ని చూసి కూటమిలో చేరేందుకు సుమారు పదిమంది కౌన్సిలర్ సిద్ధంగా ఉన్నారని, విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు మాట్లాడడానికి అని పిలిచి వారిని బలవంతంగా కిడ్నాప్ చేశారని చెప్పారు.

ఎన్నికకు కనీసం రాకుండా వారిని ఎక్కడో దాచిపెట్టి, ఎన్నిక జరగకుండా అడ్డంకులు సృష్టించినట్లు చెప్పారు. కేంద్ర పార్టీ ఆదేశాలతో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రౌడీ మూకలు అల్లర్లు సృష్టించేందుకు వస్తుంటే వారిని సమర్థవంతంగా కూటమి నేతలు అడ్డుకున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదా అని ప్రశ్నించారు. గత వైసిపి పాలనలో కనీస అభివృద్ధికి కూడా తిరువూరు పట్టణం నోచుకో లేదన్న ఆయన, తానును అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు పట్టణంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, రహదారుల మరమ్మత్తులు, తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వైసిపి పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి పట్టణం గురిందన్న ఆయన, వైసిపి మూల పడేసిన అభివృద్ధి పనులన్నింటిని తాను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటిపై చర్చించేందుకు పట్టణంలో ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నానని, చర్చకు వచ్చే ధైర్యం వైసిపి నేతలకు ఉందా అని ఆయన సవాలు విసిరారు. ఆర్భాటం కోసం పత్రికా విలేకరుల సమావేశంలో గొంతు చించుకోవడం కాదని, మన రాజకీయ చరిత్రలో తిరువూరుకు చేసిన అభివృద్ధి చూపించాలంటూ వైసిపి ఇన్చార్జ్ స్వామి దాసుకు సవాల్ విసిరారు.

తన మీద అక్రోశంతో అరవడం కేకలు వేయడం ప్రెస్మీట్లో పెట్టడం కాదని సమాజానికి ఉపయోగపడే నియోజకవర్గ సమస్యలు గూర్చి వివరిస్తూ ప్రెస్ మీట్ లు పెట్టాలని చెప్పారు. అభివృద్ధి కోసం ఇచ్చే సలహాలు అన్నిటిని తాను సంతోషంగా స్వీకరిస్తానన్నా ఆయన, తిరువూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని సూచించారు.

Leave a Reply